మూడు నెలలు రేషన్ తీసుకోకపోతే కార్డు రద్దు

by Anukaran |
Ration card cancellation
X

దిశ, వెబ్‌డెస్క్ : వరసగా మూడు నెలలు రేషన్ బియ్యం తీసుకోకపోతే ఆటోమేటిక్‌గా రేషన్ కార్డు రద్దు అవుతుందని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. శనివారం శాసనసభలో జరిగిన ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు గంగుల పై సమాధానం ఇచ్చారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని తెలిపారు. కరోనా వల్లనే కొత్తకార్డులు ఆగిపోయాయని పేర్కొన్నారు.

ఇప్పటి వరకు తెల్ల రేషన్ కార్డుల కోసం 9,41,641 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 3,59,974 మందికి ఆహార భద్రతా కార్డులు జారీ చేశామన్నారు. 92 వేల దరఖాస్తులను తిరస్కరించామని, 4,88,775 కార్డుల దరఖాస్తులు ప్రాసెస్‌లో ఉన్నాయని తెలిపారు. గత మూడు సంవత్సరాల్లో హైదరాబాద్‌లో 44 వేల 734 కార్డులు ఇచ్చామన్నారు. మరో 97 వేల కార్డులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed