- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కార్ల విక్రయానికి కంపెనీల ఆఫర్ల మంత్రం!
దిశ, వెబ్‌డెస్క్: అమ్మకాలు లేక కార్ల కంపెనీలన్నీ వినియోగదారులను ఆకట్టుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. లాక్‌డౌన్ తర్వాత ఫ్యాక్టరీలు ప్రారంభించి ఉత్పత్తులను అమ్మేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయి. అయితే, కరోనా ప్రభావం రోజురోజుకు పెరుగుతుండటంతో ఉత్పత్తి చేసిన వాహనాలను విక్రయించడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. వినియోగదారులు సైతం ఆర్థికంగా నష్టపోవడం దేనికని కొత్త వాహనాలను కొనే విషయంలో వెనకడుగు వేస్తున్నారు. ఈ పరిస్థితులను అధిగమించి కస్టమర్లను ఆకర్షించేందుకు కొన్ని స్కీమ్‌లను ప్రవేశపెట్టడానికి కంపెనీలు ఆలోచిస్తున్నాయి. ముఖ్యంగా, కస్టమర్లు వాహనాన్ని కొన్న ఏడాది తర్వాత ఈఎమ్ఐలు మొదలవడం, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు, తగ్గింపు రేట్లు, వారెంటీ పెంపు వంటివి ప్రధానంగా ఉన్నాయి. కార్ల కంపెనీలతో పాటు ఆయా కంపెనీ డీలర్లు కూడా కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి తగిన ఆఫర్లను ప్రకటిస్తున్నారు.
ఏ ఏ కంపెనీలు ఎలాంటి ఆఫర్లు ఇస్తున్నాయంటే…
* హ్యూండాయ్ కొనుగోలుదారుల కోసం మొదటి 3 నెలలు తక్కువ ఈఎమ్ఐలు కట్టుకునేలా వెసులుబాటి ఇస్తోంది. తగ్గించిన మొత్తాన్ని తర్వాతి సంవత్సరాల్లో సర్దుబాటు చేస్తారు. అంతేకాకుండా, పలు మోడళ్లపై రూ. 10 వేల నుంచి రూ. 40 వేల వరకూ డిస్కౌంట్లను, రూ. 40 వేల వరకూ ఎక్స్ఛేంజ్ బోనస్‌లను అందిస్తోంది.
*ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ తమ మోడళ్లు పోలో, వెంటో బీఎస్6 లపై డిస్కౌంట్లతో పాటు 12 నెలల ఈఎమ్ఐ హాలిడేని ఇస్తోంది.
*స్కోడా కంపెనీ కూడా సూపర్, కోడియాక్ మోడళ్లపై ఇంచుమించు ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ ఇస్తున్న ఆఫర్లనే అందిస్తోంది.
* కార్ల ఉత్పత్తిలో అతిపెద్ద కంపెనీ మారుతీ సుజుకి రూ. 10 వేల నుంచి రూ. 45 వేల మధ్య పలు డిస్కౌంట్లను అందిస్తోంది.
* టాటా మోటార్స్ సైతం రూ. 25 వేల నుంచి రూ. 40 వేల విలువైన ఆఫర్లను ఇస్తోంది.
* రెనో కంపెనీ కొనుగోలుదారుల కోసం ‘బై నౌ పే లేటర్’ అనే ప్రత్యేక స్కీమ్‌ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా మే నెలలో కారు కొన్నవారు 3 నెలల తర్వాత ఈఎమ్ఐ కట్టుకునే వీలుని కల్పిస్తోంది. దీంతోపాటు మిగిలిన కంపెనీల స్థాయిలోనే డిస్కౌంట్లను కూడా అందిస్తోంది.
* హోండా కంపెనీ అమేజ్ మోడల్‌పై రూ. 32,000 తగ్గింపుతో పాటు వారెంటీ పొడిగింపు అందిస్తోంది. సిటీ సెడాన్ మోడల్‌పై బోనస్‌లను రూ. 50 వేల నుంచి రూ. లక్షకు పెంచింది.
దాదాపు 50 రోజులుగా కార్ల కంపెనీలు ఒక్క వాహనం కూడా అమ్ముడుపోక తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వాల నుంచి స్వల్పంగా ఆంక్షలు సడలింపు ఇవ్వడంతో వాహనాలను విక్రయించేందుకు తిప్పలు పడుతున్నాయి.
Auto, Car-making companies, schemes for sale, Hyundai, Renault, Honda, Volkswagen, Mahindra & Mahindra, Tata Motors, skoda, EMI