మూలధన సమీకరణతో పాటు పరిరక్షణ

by  |
మూలధన సమీకరణతో పాటు పరిరక్షణ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ బ్యాంకులు మూలధనాన్ని పరిరక్షించుకోవడం చాలా అవసరమని, మూలధన సమీకరణ ఎంత ముఖ్యమో ఇది కూడా అంతే ముఖ్యమని ఎస్‌బీఐ నివేదిక తెలిపింది. ఈఎంఐ చెల్లింపుల వాయిదా అవకాశం ఆగష్టు 31తో ముగుస్తుండటంతో మూలధన పరిరక్షణ చాలా అవసరమని నివేదిక పేర్కోంది. ఎందుకంటే, నిరర్ధక ఆస్తులను గుర్తించి వాటికోసం బ్యాంకులు కేటాయింపులు జరపాల్సి ఉందని, దానికి నిధులు అవసరమని తెలిపింది. ఐబీసీ నిబంధనలను సంవత్సర వరకు రద్దు చేశారు. దీనివల్ల దివాలా పరిష్కారం జరగదు. అందుకోసమే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మూలధన పునర్‌వ్యవస్థీకరణ జరగాలని ఎస్‌బీఐ నివేదిక వెల్లడించింది.

దీనికి ప్రభుత్వం అందించే నిధుల సాయంపై స్పష్టత లేనందున మూలధనాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఎస్‌బీఐ నివేదిక చెబుతోంది. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు మూలధనాన్ని సమీకరించాలని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఇదివరకే చెప్పారు. మారటోరియాన్ని మరింత పొడిగించడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న సమస్యలను అధిగమించవచ్చని ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది. కాగా, కొవిడ్-19కి ముందు, తర్వాత రుణగ్రహీతల ఆర్థిక స్థితిగతులను పరిశీలించాకే పునర్‌వ్యవస్థీకరణ కల్పించాలని నివేదిక అభిప్రాయపడింది.



Next Story

Most Viewed