కాళోజీ లేని తెలంగాణను ఊహించలేం: టీఎన్జీవో

దిశ ప్రతినిధి, హైదరాబాద్: కాళోజీ కవి లేని తెలంగాణను ఊహించలేమని టీఎన్జీవో ఉద్యోగ సంఘం అభిప్రాయపడింది. ఈ మేరకు బుధవారం నాంపల్లిలోని టీఎన్జీవో కేంద్ర కార్యాలయంలో మహాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం టీఎన్జీవో నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ తొలిదశ ఉద్యమ సమయంలోనే రచయితల సంఘాన్ని స్థాపించి తెలంగాణ నా జన్మహక్కు అని నినదించిన వాది కాళోజీ అని కొనియాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో కవి కాళోజీ పోషించిన పాత్ర చిరస్మరణీయమని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం నిరంతరం తపించిన కాళోజీకి గుర్తుగా వరంగల్ లోని హెల్త్ యూనివర్శిటీకి ఆయన పేరు పెట్టి ప్రభుత్వం సముచితంగా గౌరవించిందన్నారు.

Advertisement