- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కేన్సర్‌ను జయించి.. అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్న మహిళ

దిశ, ఫీచర్స్: డ్రాగన్ క్రూ క్యాప్సుల్ ద్వారా ప్రైవేటు వ్యక్తులను అంతరిక్షంలోకి పంపేందుకు ‘స్పేస్ఎక్స్’ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. తొలి ప్రైవేటు అంతరిక్ష యాత్రగా భావిస్తున్న ఈ మిషన్‌కు ‘షిఫ్ట్4 పేమెంట్స్’ సంస్థ సీఈవో ఇసాక్‌మ్యాన్ నాయకత్వం వహిస్తున్నాడు. వ్యోమనౌకలోని మూడు సీట్లను సాధారణ ప్రజలకు కేటాయిస్తుండగా, ఇన్‌స్పిరేషన్4 సిబ్బంది డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌తో పాటు ఫాల్కన్ 9 వ్యోమనౌకలో శిక్షణను పొందనున్నారు. కాగా చిన్నతనంలోనే కేన్సర్ బారినపడి, చికిత్స తర్వాత ఆ మహమ్మారిని జయించిన అమెరికాకు చెందిన 29ఏళ్ల హేలే ఆర్సినాక్స్ అనే మహిళ అంతరిక్షంలో అడుగుపెట్టనుంది.
టెనెస్సీ, మెంఫిస్ సిటీలోని ‘సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పిటల్’లో ఫిజిషియన్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న హేలే.. ఈ ఏడాది చివరలో స్పేస్ ఎక్స్ మిషన్ చేపడుతున్న తొలి ప్రైవేట్ అంతరిక్షయాత్ర ‘ఇన్‌స్పిరేషన్4’లో భాగం కానుంది. హేలే 10 ఏళ్ల వయసులో ఉండగా క్యాన్సర్‌తో బాధపడుతూ ‘సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పిటల్’లోనే చికిత్స పొందింది. ఆ సమయంలో తన మోకాలికి ఆపరేషన్ చేసి, టైటానియం రాడ్‌ను అమర్చారు. ఇక ఈ స్పేస్ మిషన్ ద్వారా సెయింట్ జ్యూడ్ ఆస్పత్రికి విరాళాలు సేకరిస్తున్న ఇసాక్‌మ్యాన్.. నాలుగు సీట్లలో ఒక సీటును హాస్పిటల్‌కు కేటాయించగా, ఇందులో భాగంగానే హేలేను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో స్పేస్‌లో అడుగుపెడుతున్న యంగెస్ట్ అమెరికన్‌గా, ప్రొస్థెటిక్ పర్సన్‌గా హేలే చరిత్ర సృష్టించనుంది.
‘ఇన్‌స్పిరేషన్ 4 సిబ్బందిలో భాగం అవుతున్నా, ఇప్పటికీ ఆ వాస్తవాన్ని నమ్మలేకపోతున్నాను. ఇది నాకు దక్కిన అరుదైన గౌరవం. ఈ అవకాశం నాలాంటి ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లలో ఆశను కల్పిస్తోంది. ఇది సెయింట్ జూడ్ ఆసుపత్రి వల్లే సాధ్యమైంది. నాకు కేవలం 10 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, సెయింట్ జూడ్ నాకు ఎదగడానికి అవకాశం ఇచ్చింది’ అని హేలే తెలిపింది. ఇప్పుడు ఇదే పరిశోధనా ఆస్పత్రిలో పనిచేస్తూ, ప్రపంచవ్యాప్తంగా పర్యటించాలనే నా కలను నెరవేర్చుకుంటున్నాను. మనిషి తలచుకుంటే ఏదైనా సాధ్యమే అన్నదానికి నేనే ఉదాహరణ. అందుకే నేను నర్సుగా పనిచేస్తూ, లుకేమియా, లింఫోమాతో బాధపడుతున్న పిల్లలకు తగిన ధైర్యాన్ని అందిస్తున్నాను’ అని ఆమె చెప్పుకొచ్చింది.