- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రామాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ జరగాలి : గవర్నర్ తమిళిసై
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పేర్కొన్నారు. అంతేగాక వ్యాధిపై ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించాలన్నారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ (జీసీఎఫ్) ద్వారా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతున్న గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించిన ‘ఎన్‌ఎమ్‌డీసీ గ్రేస్ క్యాన్సర్ రన్’ నాల్గవ ఎడిషన్ ను ఆమె గురువారం ఓ ప్రైవేట్ హోటల్ లో లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్యాన్సర్ సోకిన వారెవ్వరూ ఆర్థిక ఇబ్బందులు కారణంగా చికిత్సకు దూరం కాకూడదన్నారు. వ్యాధిని వేగంగా గుర్తించి సత్వర చికిత్సను అందించే దిశగా కృషి చేయాలన్నారు. ఈ మేరకు ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు, ట్రస్ట్ లలో భాగస్వామ్యం కావాలని సూచించారు. క్యాన్సర్ రోగులకు వ్యాయామం ఎంతో అవసరమన్నారు.
ప్రతీ ఏటా నిర్వహిస్తున్న క్యాన్సర్ రన్ ద్వారా బాధితులకు మనోధైర్యం కల్పించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎమ్‌డీసీ సీఎండీ సుమిత్ దేబ్, ఆంకాలజిస్ట్ డా చిన్నబాబు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక కార్యదర్శి అజయ్ మిశ్రా, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సుజాతరావు, డా. ప్రమీల సుంకవల్లి తదితరులు పాల్గొన్నారు.