భూరికార్డుల ప్రక్షాళనకు కీలక భేటీ 

by srinivas |   ( Updated:2020-09-24 03:23:49.0  )
భూరికార్డుల ప్రక్షాళనకు కీలక భేటీ 
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో భూరికార్డుల ప్రక్షాళన కోసం కేబినెట్ సబ్ కమిటీ కీలక భేటీ నిర్వహించింది. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ నేతృత్వంలో మంత్రులు కన్నబాబు, అనిల్, సంబంధిత అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భూవివాదాలు తగ్గించేలా సూచనలు చేసేందుకు ఈ కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఏపీలో ప్రస్తుత రెవెన్యూ సంబంధిత సమస్యలపై భేటీలో చర్చ జరిగింది.

సులభతరమైన రెవెన్యూ సేవలు, సమగ్ర సర్వే, పక్కాగా భూరికార్డుల పరిశీలనపై సూచనలు చేసింది ఈ సబ్ కమిటీ. 22ఏ కింద ఉన్న భూములపై సరైన రీతిలో అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎస్టేట్, ఇనాం భూములపై చర్చించిన కమిటీ… వ్యవసాయ భూములకు అతి తక్కువగా కనీస రుసుము చెల్లించి, మార్పు చేసి విక్రయాలు చేస్తున్నారని అభిప్రాయపడింది.

స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులకు ఇచ్చిన భూముల విషయంలో సమస్యలు, ఫిర్యాదులు పట్ల సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకునేందుకు ఒక నెల రోజులు స్పందన ఫిర్యాదులను అధ్యయనం చేయాలని పేర్కొంది.

Advertisement

Next Story