ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ పదవికి ఆగష్టులో ఇంటర్వ్యూ

by Harish |   ( Updated:2020-07-26 10:35:16.0  )
ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ పదవికి ఆగష్టులో ఇంటర్వ్యూ
X

దిశ, వెబ్‌డెస్క్:కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని ప్యానెల్ ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ పదవికి ఆగష్టు 7న షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదివరకు జులై 23న జరగాల్సిన ఈ ఇంటర్వ్యూ అనుకోని అవాంతరాల కారణంగా వాయిదా పడింది. సీనియర్ డిప్యూటీ గవర్నర్ ఎన్ ఎస్ విశ్వనాథన్ మార్చి 31న తన పదవీకాలానికి మూడు నెలల ముందు అనారోగ్య కారణాలతో పదవిని ఖాళీ చేశారు.

కాగా, ఈ ఇంటర్వ్యూని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేయనున్నట్టు తెలుస్తోంది. ఇంటర్వ్యూ అనంతరం ఎంపిక చేసిన వారి పేరును ఆమోదం కోసం ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ నియామక కమిటీకి పంపనున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ బాధ్యతలను సెంట్రల్ బ్యాంక్ అంతర్గత అభ్యర్థికి కేటాయించారు. ఆయన కీలకమైన నియంత్రణ విధులను చూసుకుంటున్నారు. కాగా, ఆర్‌బీఐ చట్టం ప్రకారం సెంట్రల్ బ్యాంకులో నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉండాలి. ఇద్దరు ర్యాంక్ అధికారులతో పాటు ఓ కమర్షియల్ బ్యాంకర్, మరో ఆర్థిక విధాన విభాగాధిపతి ఉంటారు. ప్రస్తుతం ఆర్‌బీఐకి బీ పీ కనుంగో, ఎం.కె జైన్, మైఖేల్ పాత్రా ముగ్గురు డిప్యూటీ గవర్నర్లుగా ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed