ఈసీజీసీలో రూ. 4,400 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం

by Harish |
ఈసీజీసీలో రూ. 4,400 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం
X

దిశ, వెబ్‌డెస్క్: ఎగుమతిదారులకు, బ్యాంకులకు మద్దతిచ్చేందుకు రానున్న ఐదేళ్లలో ఎగుమతుల క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ లిమిటెడ్(ఈసీజీసీ)లో రూ. 4,400 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదించింది. ఈ పెట్టుబడుల ద్వారా వ్యవస్థీకృత రంగంలో 2.6 లక్షలతో సహా మొత్తం 59 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించేందుకు సహాయపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా ఈ చర్య రూ. 5.28 లక్షల కోట్ల అదనపు ఎగుమతులను ప్రోత్సహిస్తుందని ప్రభుత్వం తెలిపింది.

ఈసీజీసీలో రూ. 4,400 కోట్ల అదనపు మూలధనానికి మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీనివల్ల ఈసీజీసీ రూ. 88 వేల కోట్ల విలువైన బీమా పాలసీని ఇవ్వనుందని’ కేంద్ర మంత్రి పీయుష్ గోయెల్ చెప్పారు. గడిచిన ఏడాది కాలంలో ఎగుమతులపై ప్రత్యేక దృష్టి పెట్టామని, భారత్ ఈ ఏడాది సెప్టెంబర్ 21 నాటికి దాదాపు రూ. 14 లక్షల కోట్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసిందని, దేశ చరిత్రలోనే మొదటి ఆరు నెలల్లో ఇది అత్యధిక ఎగుమతుల విలువ అని పీయుష్ గోయెల్ వివరించారు. చిన్న వ్యాపారులు ఎగుమతులు చేసిన సమయంలో బీమా సౌకర్యం ఉండాలని కోరుకుంటున్నారని, పలు కారణాల వల్ల చెల్లింపులు సకాలంలో రాకపోతే ఈసీజీసీ బీమా రక్షణను అందిస్తుందని ఆయన తెలిపారు. దాదాపు 97 శాతం ఎంఎస్ఎంఈ రంగాలకు చెందినవని, ఈ పథకం కింద రూ. 500 కోట్లు తక్షణమే పంపిణీ చేయబడతాయి. రానున్న ఏడాదిలో రూ. 500 కోట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. తాజా నిర్ణయం ద్వారా వారికి ప్రత్యక్ష ప్రయోజనాలు ఉంటాయని పీయుష్ గోయెల్ వెల్లడించారు.

Advertisement

Next Story