- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి
దిశ, ఏపీ బ్యూరో: కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ యువనేత, నందికొట్కూరు ఇన్‌చార్జ్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి సీఎం జగన్ కీలక పదవి కట్టబెట్టారు. ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా నియమించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నందికొట్కూరులో పర్యటించిన సీఎం జగన్.. సిద్ధార్థ్‌రెడ్డి తన తమ్ముడు అని.. తన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని చెప్పారు. అధికారంలోకి రాగానే ఖచ్చితంగా మంచి ప్రాధాన్యత ఉన్న పోస్టును ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఇచ్చిన మాటకు కట్టుబడిన సీఎం జగన్.. బైరెడ్డిని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా నియమించారు.
2019 ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి గెలుపుకోసం బైరెడ్డి కృషి చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఆర్థర్‌కు, బైరెడ్డికి అభిప్రాయభేదాలు వచ్చాయి. ఈ వ్యవహారం సీఎం జగన్ దృష్టికి సైతం వెళ్లింది. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ రంగంలోకి దిగి ఆర్థర్, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితో చర్చించి శాంతింపజేశారు. తాజాగా ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా బైరెడ్డి పేరును ప్రకటించడంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. బైరెడ్డి ఇంటి వద్ద పార్టీ ఆఫీసు వద్ద కార్యకర్తల సందడి నెలకొంది. ఆయన అనుచరులు స్వీట్లు పంచుకున్నారు. టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు.