ఫస్ట్ మ్యాచ్‌కు ‘జాస్ బట్లర్’ దూరం

by  |
ఫస్ట్ మ్యాచ్‌కు ‘జాస్ బట్లర్’ దూరం
X

దిశ, స్పోర్ట్స్: రాజస్థాన్ రాయల్స్ (Rajasthan team) జట్టు ఈ నెల 22న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుతో తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు స్టార్ బ్యాట్స్‌మాన్ జాస్ బట్లర్ (Jas butler) దూరం కానున్నాడు. ప్రస్తుతం దుబాయ్‌లోని ఒక హోటల్‌లో కుటుంబంతో సహా క్వారంటైన్‌(Quarantain)లో గడుపుతున్న బట్లర్.. తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండనని స్పష్టం చేశాడు.

ఇంగ్లాండ్ (England), ఆస్ట్రేలియా (Australia)ఆటగాళ్లు అందరూ కలసి దుబాయ్ (Dubai) చేరుకున్నారు. బయోబబుల్ నుంచి బయోబబుల్‌ (Bio bubble)కు వచ్చినందున బీసీసీఐ (Bcci) వారందరికీ 36 గంటల క్వారంటైన్ విధించింది. అయితే బట్లర్ మాత్రం ఆస్ట్రేలియా సిరీస్ అనంతరం కుటుంబంతో కలిసి విడిగా యూఏఈ (UAE) చేరుకున్నాడు. దీంతో అతనికి 6 రోజుల క్వారంటైన్ విధించారు. ఈ నెల 22కు ఆ క్వారంటైన్ గడువు పూర్తి కాదు కాబట్టి తాను తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండనని ఇన్‌స్టాగ్రమ్‌ (Instagram)లో పేర్కొన్నాడు.


Next Story

Most Viewed