- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హైదరాబాద్‌లో మరో ఘరానా మోసం.. రూ.11 కోట్లకు టోకరా..!

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలో ఇటీవల భారీ మోసాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఫారెస్టు ఆయిల్ పేరుతో కొందరు కేటుగాళ్లు భారీ మోసానికి తెగబడ్డారు. నగరంలోని ఓ వ్యాపారికి గీత నారాయణ్ అనే ఫేస్‌బుక్ అకౌంట్ పేరిట సైబర్ నేరగాళ్లు రిక్వెస్ట్ పంపారు. తాము అమెరికాలో ఖరీదైన ఆయిల్ బిజినెస్ చేస్తున్నామని నమ్మించి రూ.11 కోట్లు కొల్లగొట్టారు.
వ్యాక్సిన్స్ తయారీకి అవసరమయ్యే అగ్రో సీడ్ ఆయిల్‌ను తాము సప్లయ్ చేస్తామని నమ్మించి విడతల వారీగా రూ.11 కోట్లు ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేయించుకున్నట్టు సమాచారం. తీరా ఆయిల్ పంపించకపోవడంతో మోసపోయినట్టు భావించిన బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సైబర్ పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story