జీఎస్టీ రిటర్నుల దాఖలుకు వెసులుబాటు..

by Harish |   ( Updated:2021-08-01 06:20:50.0  )
జీఎస్టీ రిటర్నుల దాఖలుకు వెసులుబాటు..
X

దిశ, వెబ్‌డెస్క్: జీఎస్టీ రిటర్నుల దాఖలుకు సంబంధించి కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల విభాగం(సీబీఐసీ) చిన్న కంపెనీలకు వెసులుబాటు ఇచ్చింది. రూ. 5 కోట్లకు మించి టర్నోవల్ కలిగిన కంపెనీలు చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ) ఆడిట్ చేసిన రిటర్నులకు బదులు స్వీయ మదింపు రిటర్నులను దాఖలు చేసుకునే అవకాశం ఇస్తున్నట్టు సీబీఐసీ ఓ ప్రకటనలో తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక నివేదిక రూ. 2 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలు జీఎస్టీఆర్-9/9ఏ ద్వారా రిటర్నులను దాఖలు తప్పనిసరి. రూ.5 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీలు జీఎస్టీఆర్-9సీ అదనంగా సర్దుబాటు స్టేట్‌మెంట్ సమర్పించాలి. ఇప్పటివరకు స్టేట్‌మెంట్‌కు సీఏల గుర్తింపు తప్పనిసరిగా ఉండాలని, తాజాగా సీబీఐసీ ఇందులో మార్పులు చేస్తూ ఈ కంపెనీలు స్వయంగా మదింపు చేసినటువంటి రిటర్నులను దాఖలు చేయడానికి అవకాశం కల్పించింది.

“వృత్తిపరంగా అర్హత కలిగిన సీఏల నుంచి జీఎస్టీ ఆడిట్ చేసిన రిటర్నులను ప్రభుత్వం తొలగించింది. ఇప్పుడు రూ. 5 కోట్లకు పైన టర్నోవల్ ఉన్న కంపెనీలు వార్షిక ఫైలింగ్‌లో స్వయంగా రిటర్నులను దాఖలు చేయవచ్చని” ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్ట్‌నర్ రజత్ మోహన్ చెప్పారు. ఈ నిర్ణయం ద్వారా వేలాది మంది పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం లభిస్తుంది. అయితే పరోక్ష పన్నుల విభాగం పరిశీలించిన తర్వాత వార్షిక ఫైలింగ్‌లో ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తే తగిన చర్యలు తీసుకోనున్నట్టు ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed