- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Zepto: రిటర్న్, ఎక్స్‌ఛేంజ్ ఫీచర్లను ప్రారంభించిన 'జెప్టో'

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ క్విక్-కామర్స్ కంపెనీ జెప్టో వినియోగదారుల కోసం ప్రత్యేక ఫీచర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన ఉత్పత్తులపై ఇన్‌స్టంట్ రిటర్న్స్, ఎక్స్‌ఛేంజ్ సౌకర్యం కల్పిస్తున్నట్టు గురువారం ప్రకటనలో తెలిపింది. ఇవి ఎలక్ట్రానిక్స్, దుస్తులు, స్పోర్ట్స్, బొమ్మలు, కిచెన్‌వేర్ సహా మరికొన్ని ఎంపిక చేసిన వాటిపై ఈ ఫీచర్లను ఉపయోగించవచ్చని కంపెనీ వెల్లడించింది. కేవలం 10 నిమిషాల డెలివరీ సేవల్లో ఈ ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా కంపెనీ తెలిపింది. తమ డెలివరీ వ్యవస్థ సామర్థ్యాన్ని ఇది సూచిస్తుందని, రిటర్న్ ఫీచర్‌కు సంబంధించి చాలా ఉత్పత్తులకు అమలు చేసినప్పటికీ, నియంత్రణా పరమైన కారణాల వల్ల హెల్త్, సేఫ్టీ వంటి ఉత్పత్తుల విభాగాల్లో ఈ ఫీచర్‌ను ఇవ్వడంలేదు. రిటర్న్ ప్రక్రియ తర్వాత రీఫండ్లు తక్షణం జరుగుతాయని, క్యాష్ ఆన్ డెలివరీలకు సంబంధించి రీఫండ్ మొత్తానికి సమానమైన వోచర్లను ఇవ్వనున్నట్టు కంపెనీ ప్రతినిధి ఒకరు వివరించారు. రిటర్న్ చేయలేని వస్తువుల జాబితాలో ఇన్నర్‌వేర్, బంగారం, వెండి నాణెలు, సాక్స్ సహా పూజా సామగ్రి, టిష్యూ, డిస్పోజబుల్ వంటివి ఉన్నాయని కంపెనీ పేర్కొంది. కస్టమర్లు తమ ఆర్డర్లను ఏడు రోజుల వ్యవధిలో రిటర్న్ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చని కంపెనీ స్పష్టం చేసింది.