Zepto Cafe: జెప్టో నుంచి కొత్త యాప్ లాంచ్.. త్వరలోనే అందుబాటులోకి..!

by Maddikunta Saikiran |
Zepto Cafe: జెప్టో నుంచి కొత్త యాప్ లాంచ్.. త్వరలోనే అందుబాటులోకి..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ క్విక్ కామర్స్(Quick Commerce) సంస్థ జెప్టో(Zepto) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల కాలంలో ఆ సంస్థ క్విక్ కామర్స్ రంగంలో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా కేఫ్ ఆఫరింగ్స్(Cafe Offerings)లోనూ తన వ్యాపారాన్ని విస్తరించే పనిలో ఉంది. అందులో భాగంగా కేఫ్ ఆఫరింగ్స్ కోసం త్వరలో జెప్టో కేఫ్(Zepto Cafe) పేరుతో కొత్త యాప్ లాంచ్ చేయనుంది. ఈ విషయాన్ని జెప్టో కో- ఫౌండర్(Co-Founder) ఆదిత్ పాలిచా(Adit Palicha) లింక్డిన్ వేదికగా వెల్లడించారు. వచ్చే వారం నుంచి ఈ యాప్ ద్వారా కేఫ్ సర్వీసులు పొందచ్చని పేర్కొన్నారు. అయితే ఈ ప్రస్తుతం ఈ సేవలు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, పూణే లాంటి నగరాల్లో అందుబాటులోకి తీసుకురానున్నామని, త్వరలోనే మరిన్ని ప్రాంతాలకు దీన్ని విస్తరిస్తామని ఆయన తెలిపారు. కాగా కస్టమర్లు జెప్టో కేఫ్ యాప్ ద్వారా టీ(Tea), స్నాక్స్(Snacks), కాఫీ(Coffee), పానీయాల(Beverages)ను కేవలం 10 నిమిషాల్లో పొందొచ్చు. ఈ యాప్ లో మొత్తం 148 రకాల ఫుడ్ ఆప్షన్లు ఉన్నాయి. కాగా జెప్టో 2025లో ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్(IPO)లోకి వచ్చేందుకు సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed