Youtube: కంటెంట్ క్రియేటర్లకు గుడ్​న్యూస్.. యూట్యూబ్ నుంచి మరో కొత్త ఫీచర్..!

by Maddikunta Saikiran |
Youtube: కంటెంట్ క్రియేటర్లకు గుడ్​న్యూస్.. యూట్యూబ్ నుంచి మరో కొత్త ఫీచర్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్(Youtube) యూజర్లను ఆకట్టుకోవడనికి ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక విషయాలలో కొత్త అప్ డేట్(Update) లను తీసుకొచ్చిన యూట్యూబ్ తాజాగా కంటెంట్ క్రియేటర్ల కోసం మరో కొత్త ఫీచర్‌(New feature)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(AI) ఆధారంగా పని చేసే ఆటో డబ్(Auto Dub) ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు ఇతర లాంగ్వేజ్(Language)లలో కూడా తమ కంటెంట్ వినిపించొచ్చని కంపెనీ తన అధికారిక బ్లాగ్ పోస్ట్(Blog Post)లో వెల్లడించింది.

ఈ ఏఐ ఆధారిత ఫీచర్ వీడియోల్లోని వాయిస్‌ను ఆటోమేటిక్‌గా డబ్(Dub) చేసి వివిధ భాషల్లోకి మార్చి వినిపిస్తుంది. భాషా పరంగా అడ్డంకులు లేకుండా వీడియోలను ఇతర భాషల్లో పోస్ట్ చేసేందుకు ఇది సహాయపడుతుంది. ఇంగ్లిష్‌లోని వీడియో కంటెంట్‌ను ఫ్రెంచ్, జర్మన్, హిందీ, ఇండోనేషియన్, ఇటాలియన్, జపనీస్, పోర్చుగీస్, స్పానిష్ వంటి తదితర భాషల్లోకి ఆటోమేటిక్‌గా డబ్ చేయగలదు. అయితే.. వాయిస్‌ను గుర్తించలేని పక్షంలో డబ్బింగ్ ఆప్షన్ పని చేయదని, కంటెంట్ క్రియేటర్ల ఫీడ్‌బ్యాక్(Feedback) ఆధారంగా ఈ ఫీచర్‌లో మరిన్ని ఛేంజెస్(Changes) చేస్తామని యూట్యూబ్ పేర్కొంది.

Advertisement

Next Story