- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెగ్యులేటరీ చట్టాలను పాటించడంలో ఫిన్‌టెక్‌లకు మరింత శ్రద్ధ అవసరం
దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై విధించిన ఆంక్షల ద్వారా మరోసారి రెగ్యులేటరీ చట్టాలను పాటించడంలోని ప్రాధాన్యతను ఫిన్‌టెక్ కంపెనీలు గుర్తించాలని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. రెగ్యులేటరీ అనుమతులు కంపెనీలకు 'ఐచ్ఛికం(ఆప్షనల్)' కాదని, ప్రతి వ్యవస్థాపకుడు పూర్తి శ్రద్ధతో నియంత్రణాపరమైన నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వ్యవహారం రెగ్యులేటరీ అనుమతుల అవసరాన్ని గుర్తించడంలో వైఫల్యాన్ని హెచ్చరించే సంఘటన. లేదంటే నిబంధనలను దాటి ఎవరూ తప్పించుకోలేరని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రిగా రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. భారత్ లేదా విదేశాల నుంచి వచ్చిన ఏ కంపెనీ అయినా, స్థానిక చట్టాలకు కట్టుబడి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో పేటీఎంపై ఆర్‌బీఐ చర్య ఫిన్‌టెక్ రంగాన్ని దెబ్బతీస్తుందనే వాదన సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. 'నియంత్రణాపరమైన నిబంధలను పాటించడం వల్ల ఇలాంటి సమస్యలను అధిగమించాలి. ఇది ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ఉండేదే. వ్యాపారాన్ని అభివృద్ధి చేయడంలో నిబంధనల విషయంలో పట్టు కోల్పోవచ్చు. ఇది స్టార్టప్ కంపెనీల్లోనే ఎక్కువగా ఉంది. ఏదైనా కంపెనీ ఏర్పాటు సమయంలో వాటి వృద్ధి, విస్తరణతోపాటు కొన్ని నియమాలను అర్థం చేసుకోవడం మర్చిపోకూడదని' మంత్రి వివరించారు.