Gold Price: మూడు రోజుల్లో రూ. 4,000 తగ్గిన బంగారం

by S Gopi |
Gold Price: మూడు రోజుల్లో రూ. 4,000 తగ్గిన బంగారం
X

దిశ, బిజినెస్ బ్యూరో: గడిచిన ఏడాదిన్నర కాలంగా పైపైకి పోతున్న బంగారం ధరలు భారీగా పడుతోంది. మూడు రోజుల వ్యవధిలోనే 10 గ్రాముల పసిడి రూ. 4,000 వరకు దిగిరావడం బంగారం కొనుగోలుదారులకు సంతోషం కలిగిస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఆగకుండా పెరుగుతున్న బంగారం క్రమంగా తగ్గుతోంది. తాజాగా కేంద్రం బడ్జెట్‌లో బంగారంపై కస్టమ్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడం, దానికితోడు అంతర్జాతీయంగా కూదా డిమాండ్ క్షీణించడంతో రిటైల్ ఆభరణాల తయారీదారులు జోరుగా విక్రయాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే దేశీయంగా గురువారం కూడా బంగారం ఒక్కరోజే రూ. వెయ్యికి పైగా తగ్గింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల పసిడి రూ. 1,040 తగ్గి రూ. 69,820 వద్ద ఉంది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం రూ. 950 దిగొచ్చి రూ. 64,000కు చేరింది. వెండి సైతం కిలోకు రూ. 3,000 క్షీణించి రూ. 89,000 చేరుకుంది. మూడు రోజుల్లో వెండి రూ. 7 వేలకు పైగా పడిపోయింది. గ్లోబల్ మార్కెట్లలోనూ బంగారం ఔన్స్ ధర 2,374 వద్ద ఉంది. త్వరలో అమెరికా జీడీపీ, వినియోగ వ్యయానికి సంబంధించిన గణాంకాలు బంగారం ధరలను ప్రభావితం చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed