- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PAN Card : ఆధార్‌తో తప్పుడు పాన్ లింక్ అయిందా..? అయితే ఈ విధంగా సరిదిద్దుకోండి!
దిశ, వెబ్‌డెస్క్: ఆధార్-పాన్ లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతుంది. ఇప్పటికే చివరి తేదీని చాలా సార్లు పొడిగించారు. తాజాగా చివరి తేదీని రూ.1000 ఫీజుతో జూన్ 30, 2023 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ తేదీలోపు ఆధార్-పాన్ లింక్ పూర్తి చేయని వారి పాన్ కార్డు పని చేయకుండా పోతుందని ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది. అయితే, చివరి తేదీ దగ్గరపడుతుందని లేదా పాన్ కార్డు తప్పులు చూసుకోకుండా తప్పుడు పాన్ కార్డుతో ఆధార్‌ను లింక్ చేసిన వారు ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారు సరైన పాన్ కార్డును ఎలా లింక్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఈ సమస్య నుంచి వారు బయటపడటానికి ఇప్పటికే లింక్ అయిన తప్పులు గల పాన్‌ను డీలింక్ చేయాల్సి ఉంటుంది.
తప్పులు గల పాన్‌ను ఆధార్‌కు డీలింక్ చేసే విధానం..
మీ పాన్ వివరాలు తప్పుగా ఉన్న లేక ఒకే నెంబర్ ఇద్దరు లేదా ఎక్కువ మందికి జారీ చేసిన సందర్భంలో అయిన వెంటనే దాని తాలూకు వివరాలను ఆదాయపు పన్ను విభాగానికి సమర్పించాలి. ఒకే నంబర్‌పై రెండు పాన్ కార్డులు ఉంటే అందులో ఒకటి డీయాక్టివెట్ చేయాలి. వేరే వ్యక్తి ఆధార్‌తో మీ పాన్ కార్డు లింక్ అయినట్లయితే మీకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఆదాయపు పన్ను శాఖకు సమర్పించి, తప్పును సరిదిద్దాల్సింగా కోరాలి.
తప్పుడు పాన్‌తో ఆధార్ లింక్ అయినట్లు గుర్తిస్తే పాన్-ఆధార్ డీలింక్ చేయడం కోసం ఆధార్ కార్డు, పాన్ కార్డు, పోస్టల్ అడ్రస్ ప్రూఫ్, గ్రీవియన్స్ లెటర్ కాపీ, ఈ-మెయిల్ అడ్రస్ మొదలగు వివరాలతో ఆదాయపు పన్ను శాఖ అధికారులను సంప్రదించవచ్చు లేదా ఆన్‌లైన్ ద్వారా అయిన వారికి రిక్వెస్ట్ పెట్టవచ్చు. వారు వెరిఫికేషన్ చేశాక, తప్పులు గల పాన్‌ను ఆధార్‌కు డీలింక్ చేస్తారు. ఆ తరువాత మీరు సరైన పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవచ్చు.
Read more:
ఒకే ఒక్క ఎస్ఎంఎస్ తో ఆధార్-పాన్ ను లింక్ చేసుకోండిలా..!
మీ పాన్ కార్డు వ్యాలిడిటీని ఇలా చెక్ చేసుకోండి!
PAN Aadhaar Linking Check :మీ ఆధార్‌తో పాన్ లింక్ అయిందో లేదో మెసేజ్ ద్వారా ఈ విధంగా తెలుసుకోండి!