- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సగం జీతానికే పనిచేయాలన్న విప్రో నిర్ణయాన్ని ఖండించిన ఐటీ సంఘం!
బెంగళూరు: విధుల్లోకి వచ్చే ఫ్రెషర్స్ సగం జీతానికే పనిచేయాలనే టెక్ దిగ్గజం విప్రో నిర్ణయాన్ని ఐటీ సంఘం తప్పుబట్టింది. ఇది అన్యాయమని, ఆమోదించదగ్గ చర్య కాదని, విప్రో దీనికి సంబంధించి పునఃపరిశీలించాలని ఐటీ ఉద్యోగుల సంఘం నైట్స్ మంగళవారం ప్రకటనలో తెలిపింది. విప్రో నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జీతాలను సగానికి తగ్గించుకోవాలనడం సరైంది కాదని, ఆర్థిక కష్టాన్ని ఉద్యోగులపై మోపడం అనైతికమని నైట్స్ అధ్యక్షుడు హర్‌పీత్ సింగ్ అన్నారు.
సంస్థ, ఉద్యోగులతో యూనియన్ చర్చలు నిర్వహించాలని, తమ సభ్యులకు అన్యాయం జరిగితే స్పందిస్తామని ఆయన తెలిపారు. ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితులు, టెక్ కంపెనీల్లో నెలకొన్న సవాళ్లను ప్రతిబింబించేలా విప్రో నిర్ణయం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
అంతకుముందు విప్రో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి కారణంగా ముందుగా ఒప్పుకున్న వార్షిక వేతన ప్యాకేజీని సగానికి తగ్గిస్తామని విప్రో ఉద్యోగులకు మెయిల్ ద్వారా వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం శిక్షణ పూర్తయిన ఫ్రెషర్లకు రూ. 6.5 లక్షల ప్యాకేజీ ఇచ్చాం. వారికి ఈ ఏడాది మార్చి నుంచి నియామకాలు ఉంటాయని, కానీ సగం జీతంతో విధుల్లోకి రావాలని కోరింది.