- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వచ్చే 25 ఏళ్లలో మరోస్థాయికి కంపెనీ: వేదాంత ఛైర్మన్
దిశ, బిజినెస్ బ్యూరో: అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంతా లిమిటెడ్ భవిష్యత్తులో తన వ్యాపారాల్లో సుమారు రూ. 50 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్టు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు పెట్టుబడిదారుల సమావేశంలో తెలిపారు. ప్రస్తుతం సంస్థ 50కి పైగా ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. వృద్ధిని మరింత పెంచేందుకు విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నాం. దీనివల్ల ఆదాయం రూ. 50 వేల కోట్ల వరకు పెరగనుంది. ఈ సందర్భంగా మాట్లాడిన అనిల్ అగర్వాల్, రాబోయే 25 ఏళ్లలో కంపెనీ వేరే స్థాయికి చేరుకుంటుందని అన్నారు. అలాగే, ఈ నెలాఖరుతో ముగిసే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంస్థ ఎబిటా 5 బిలియన్ డాలర్ల నుంచి 6 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. ఆయన సోదరుడు, వేదాంత వైస్-ఛైర్మన్ మాట్లాడుతూ, ఏటా రూ. 62 వేల కోట్లకు పైగా ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి. అన్ని వ్యాపార విభాగాల్లో రూ. 50 కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతున్నామని, దీనివల్ల వార్షిక ఎబిటా మెరుగుపడుతుందని' వివరించారు. జింక్, వెండి, సీసం, అల్యూమినియం, క్రోమియం, రాగి, నికెల్ వంటి లోహాలు, ఖనిజాలతో దేశీయ, ప్రపంచ సంస్థలలో వేదాంత ప్రత్యేక పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. ఆయిల్ అండ్ గ్యాస్, ఇనుప ఖనిజం, ఉక్కుతో సహా విద్యుత్, బొగ్గు, పునరుత్పాదక ఇంధన వ్యాపారాలను నిర్వహిస్తోంది. తాజాగా సెమీకండక్టర్స్, డిస్‌ప్లే గ్లాస్ తయారీలోకి ప్రవేశించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని వ్యాపారాల్లోనూ విస్తరణను పెంచాలని కంపెనీ భావిస్తున్నట్టు ఎగ్జిక్యూటివ్‌లు పేర్కొన్నారు.