- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలో తగ్గిపోతున్న బ్లూ కాలర్ ఉద్యోగులు!
న్యూఢిల్లీ: దేశంలో బ్లూ కాలర్ ఉద్యోగాల ఖాళీలు ఈ ఏడాది మార్చి నాటికి 57.1 లక్షలకు పెరిగాయని ఓ నివేదిక తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఖాళీల సంఖ్య 53.3 లక్షలుగా ఉండేది. గత కొన్నేళ్లలో బ్లూ కాలర్ ఉద్యోగాలకు డిమాండ్ గణనీయంగా పడిపోయిందని క్వెస్ కార్ప్ అనుబంధ సంస్థ బిలియన్ కెరీర్స్ డేటా వెల్లడించింది. దేశంలో బ్లూ కాలర్ ఉద్యోగుల సంఖ్య 2021-22 లో 33.4 లక్షల నుంచి గత ఆర్థిక సంవత్సరానికి 20.1 లక్షలకు తగ్గిందని మంగళవారం విడుదలైన డేటా తెలిపింది.
ముఖ్యంగా డెలివరీ సేవలు, డ్రైవర్, బీపీఓ, కస్టమర్ కేర్, డేటా ఎంట్రీ వంటి ఉద్యోగాలకు గిరాకీ తగ్గింది. ఫీల్డ్ సేల్స్, బిజినెస్ డెవలప్‌మెంట్, హెచ్ఆర్, అడ్మిన్, సెక్యూరిటీ గార్డ్ వంటి విభాగాల్లో ఉద్యోగుల సంఖ్య పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో ఈ ఉద్యోగాలు క్షీణించాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బ్లూ కాలర్ ఉద్యోగాలకు అత్యధిక డిమాండ్ ఢిల్లీలో 54 శాతం పెరగ్గా, ఈ-కామర్స్, డెలివరీ సేవలు, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ రంగాల్లో పెట్టుబడులు పెరగడం వల్ల ఢిల్లీలో గిరాకీ పుంజుకుందని గణాంకాలు తెలిపాయి.
బెంగళూరు, హైదరాబాద్, పూణె నగరాల్లో గిరాకీ క్షీణించిందని బిలియన్ కెరీర్స్ నివేదిక తెలిపింది. ఇక, దేశంలోని మొత్తం బ్లూ కాలర్ ఉద్యోగుల్లో మహిళలు కేవలం 15.74 శాతం మాత్రమే ఉన్నారని, 84.26 శాతం మంది పురుషులు ఉన్నట్టు నివేదిక పేర్కొంది.