- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొదటిసారి 100 బిలియన్లు దాటిన యూపీఐ లావాదేవీలు
దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో యూపీఐ లావాదేవీలు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24లో రికార్డు స్థాయిలో పెరిగాయి. సంఖ్యా పరంగా 57 శాతం, విలువ పరంగా 44 శాతం పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. నెలవారీగా కూడా ఈ ఏడాది మార్చిలో లావాదేవీలు 55 శాతం పెరిగి 13.44 బిలియన్లకు చేరగా, విలువ పరంగా 40 శాతం వృద్ధితో రూ. 19.78 లక్షల కోట్లకు పెరిగాయి. 2022-23లో 84 బిలియన్ల యూపీఐ లావాదేవీలు నమోదయ్యాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో యూపీఐ లావాదేవీలు 100 బిలియన్లు దాటి 131 బిలియన్లకు చేరుకోవడం ఇదే మొదటిసారి. 2023 ఏడాదిలోనూ విలువ పరంగా అంతకుముందు ఏడాది రూ. 139.1 లక్షల కోట్ల నుంచి రూ. 199.89 లక్షల కోట్లకు చేరుకోవడం విశేషం. ఈ ఏడాది జన్వరిలో యూపీఐ లావాదేవీలు 12.20 బిలియన్లు, విలువ పరంగా రూ. 18.41 లక్షల కోట్లుగా నమోదవగా, ఆ తర్వాత ఫిబ్రవరిలో 12.10 బిలియన్ల లావాదేవీలు, విలువలో రూ. 18.28 లక్షల కోట్లకు చేరాయి. మార్చిలో ఫాస్టాగ్ లావాదేవీలు సంఖ్యా పరంగా 11 శాతం పెరిగి 33.9 కోట్లు, విలువలో 17 శాతం వృద్ధితో రూ. 5,939 కోట్లకు చేరాయి.