CEO పదవీకాలం తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్‌గా ఉదయ్ కోటక్

by Harish |
CEO పదవీకాలం తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్‌గా ఉదయ్ కోటక్
X

ముంబై: దేశీయ మూడవ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ పదవీకాలం ఈ ఏడాది చివర్లో ముగియనుంది. ఆ తరువాత ఆయన బ్యాంకు నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా కొనసాగుతారని బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

కోటక్ మహీంద్రా బ్యాంక్‌ 1985లో నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థగా ప్రారంభమైంది, అప్పటి నుంచి దాని సీఈఓగా ఉదయ్ కోటక్ పనిచేస్తున్నారు. ఆర్‌బీఐ నిబంధనలను అనుసరించి, ఆయన డిసెంబర్ 31, 2023 నాటికి తన CEO పదవి నుండి వైదొలగనున్నారు. ఉదయ్ కోటక్‌ను బ్యాంక్‌కు నాన్-ఎగ్జిక్యూటివ్ నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమించాలనే తీర్మానంలో దాదాపు 99 శాతం ఓట్లు అనుకూలంగా వచ్చాయి.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఉదయ్ కోటక్ నికర విలువ దాదాపు $13.4 బిలియన్లుగా ఉంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ 2022 చివరి నాటికి భారతదేశం అంతటా 1,752 శాఖలను కలిగి ఉంది. ఇది 2003లో వాణిజ్య బ్యాంకుగా మారింది. బ్యాంకు తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కోసం వెతుకులాటలో ఉంది.

Advertisement

Next Story

Most Viewed