- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TRAI: టెలికాం కంపెనీల నుంచి పెనాల్టీలు వసూలు చేయాలని కోరిన ట్రాయ్
దిశ, బిజినెస్ బ్యూరో: గత కొన్నేళ్ల నుంచి స్పామ్ కాల్స్‌ను అరికట్టడంలో అసమర్థతకు గానూ టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ టెలికాం కంపెనీలపై జరిమానాలు విధించింది. అయితే, విధించిన జరిమానాను కట్టడంలో టెలికాం కంపెనీలు విఫలమయ్యాయి. తాజాగా ఈ వ్యవహారంలో ఉదాసీనతను గుర్తించిన ట్రాయ్ టెలికాం కంపెనీల నుంచి బ్యాంక్ గ్యారెంటీలను ఎన్‌క్యాష్ చేయాలని టెలికాం డిపార్ట్‌మెంట్‌కు సిఫార్సు చేసింది. ట్రాయ్ నిర్ణయం ద్వారా టెలికాం కంపెనీలకు నిబంధనలను గుర్తు చేయడమే కాకుండా, వాటిపై విధించిన రూ. 115 కోట్ల వరకు జరిమానా నిధులు టెలికాం విభాగానికి చేరనున్నాయి. మొత్తం పెనాల్టీల్లో 8-10 ఏళ్ల కాలంలో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ నుంచి దాదాపు రూ. 50 కోట్లు రికవరీ అవ్వాల్సి ఉంది. దీని తర్వాత భారతీ ఎయిర్‌టెల్ నుంచి రూ. 20 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 15 కోట్లు, రిలయన్స్ జియో నుంచి రూ. 12 కోట్ల బకాయిలు ఉన్నాయి.