మొబైల్ నంబర్ పోర్టబులిటీలో కొత్త నిబంధన తీసుకొచ్చిన ట్రాయ్

by S Gopi |
మొబైల్ నంబర్ పోర్టబులిటీలో కొత్త నిబంధన తీసుకొచ్చిన ట్రాయ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: సిమ్ కార్డుల స్వాప్ మోసాలను నిలువరించేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ మొబైల్ నంబర్ పోర్టబిలిటీలో కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. మొబైల్ నంబర్ మార్చకుండా వేరే నెట్‌వర్క్‌కు మారే ఈ విధానంలో సిమ్ కార్డు స్వాప్ లేదంటే రీప్లేస్ చేసిన వారం రోజుల వరకు ఇతర నెట్‌వర్క్‌కు మారడాన్ని నిలిపేసింది. సిమ్ కార్డుల స్వాప్ మోసాలను కట్టడి చేయడానికే ఈ నిబంధన అని, ఈ ఏడాది జూలై 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానున్నట్టు ట్రాయ్ స్పష్టం చేసింది. సిమ్ పేరున జరిగే మోసాలను ఆపేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన సర్క్యులర్‌ను గతవారమే ట్రాయ్ జారీ చేసింది. దీని ద్వారా, ఎవరైన ఒక వ్యక్తి సిమ్ కార్డు మార్చుకోవడం, స్వాప్ చేసుకున్నప్పటికీ 7 రోజుల వరకు ఇతర నెట్‌వర్క్‌కు మారడానికి కావాల్సిన యూనిక్ పోర్టింగ్ కోడ్(యూపీసీ) జారీ చేయరు. కొత్త వ్యక్తి పేరుతో అదే నంబర్ తీసుకోకుండా మోసగాళ్లను అరికట్టేందుకు ఈ నిబంధన తీసుకొచ్చామని ట్రాయ్ పేర్కొంది.

Advertisement

Next Story