TRAI: పెరుగుతున్న సైబర్ నేరాలు.. మొబైల్ యూజర్లకు ట్రాయ్ హెచ్చరిక

by Maddikunta Saikiran |
TRAI: పెరుగుతున్న సైబర్ నేరాలు.. మొబైల్ యూజర్లకు ట్రాయ్ హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం(India)లో గత కొన్ని రోజుల నుంచి సైబర్ క్రైమ్స్(Cyber ​​Crimes) పెరిగిపోతున్న విషయం తెలిసిందే. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త అవతారాలెత్తి ప్రజల నుంచి డబ్బులను దోచేస్తున్నారు. ఇటీవలే డిజిటల్ అరెస్ట్(Digital Arrest) పేరుతో కేటుగాళ్లు పలువురిని మోసం చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలో మొబైల్ యూజర్లకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) హెచ్చరికలు జారీ చేసింది. గుర్తుతెలియని ఫోన్ నంబర్ల నుంచి వచ్చే స్పామ్ కాల్స్(Spam calls), మెసేజ్(Message)ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అలాగే వివిధ సోషల్ మీడియా యాప్స్(Social Media Apps)లలో వచ్చే ఫేక్ లింకులను ఓపెన్ చేయవద్దని సూచించింది. సైబర్ నేరగాళ్లు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులమంటూ ఫోన్ చేసి మీరు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు మేము గుర్తించాం. మిమ్మల్ని అరెస్ట్ చేయొద్దంటే మీరు మాకు కొంత డబ్బును చెల్లించాలని పలువురిని బెదిరిస్తున్నారు. అయితే అలాంటి వాటికి భయపడకుండా https://sancharsaathi.gov.in/ అనే వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని మొబైల్ వినియోగదారులను సూచిస్తూ ఓ వీడియో షేర్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed