5-Year Recurring Deposit : ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచిన కేంద్రం!

by Harish |   ( Updated:2023-09-29 17:53:45.0  )
5-Year Recurring Deposit : ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచిన కేంద్రం!
X

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రకటించింది. ఐదేళ్ల కాలవ్యవధి కలిగిన రికరింగ్ డిపాజిట్(ఆర్‌డీ)లపై వడ్డీని 6.5 శాతం నుంచి 6.7 శాతానికి పెంచింది. మిగిలిన అన్ని పొదుపు పథకాల వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు చేయలేదు. అక్టోబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31 మధ్య కాలానికి ఈ వడ్డీ రెట్లు వర్తించనున్నట్టు ప్రభుత్వం శుక్రవారం ఇచ్చిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ఎక్కువ ఆదరణ కలిగిన సుకన్య సమృద్ధి యోజన(ఎస్ఎస్‌వై), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్) పథకాలపై వడ్డీ రేట్లలో మార్పు చేయకపోవడం గమనార్హం. దాంతో ప్రస్తుతం పీపీఎఫ్ పథకంపై 7.1 శాతం, ఎస్ఎస్‌వైలో 8 శాతం వడ్డీ రేట్లు కొనసాగనున్నాయి. మిగిలిన వాటిలో సాధారణ సేవింగ్స్ ఖాతాలపై 4 శాతం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ 7.7 శాతం, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 8.2 శాతం, కిసాన్ వికాస్ పత్ర 7.5 శాతం, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌పై 7.4 శాతం వడ్డీ ఉంది.

ఇవి కూడా చదవండి : అధిక పింఛను వివరాల అప్‌లోడ్‌కు గడువు పెంచిన ప్రభుత్వం!

Advertisement

Next Story

Most Viewed