Tesla: దటీజ్ మోదీ.. ఒక్క భేటీతో మారిపోయిన సీన్.. ఇండియాలో టెస్లా నియామకాల హోరు!

by Vennela |
Tesla: దటీజ్ మోదీ.. ఒక్క భేటీతో మారిపోయిన సీన్.. ఇండియాలో టెస్లా నియామకాల హోరు!
X

దిశ, వెబ్ డెస్క్: Tesla: టెక్ దిగ్గజం టెస్లా(Tesla) భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఎంతోకాలంగా ప్రయత్నాలు చేస్తోంది. కానీ సుంకాలు, ఇతర కారణాలతో ఆ ప్రణాళికలు ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు అందుకు సంబంధించి కీలక ముందడుగు పడినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ కంపెనీ భారత్ లో నియామకాల ప్రక్రియ చేపట్టి ఎంట్రీపై సంకేతాలు ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) అమెరికా పర్యటన తర్వాత కొన్ని రోజులకే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రధాని మోడీ (PM Modi)అమెరికా పర్యటన సందర్భంగా, టెస్లా సీఈఓ మస్క్(mask) ఆయనను కలిశారు. సోమవారం (ఫిబ్రవరి 17), టెస్లా లింక్డ్ఇన్‌లో 13 స్థానాలకు నియామకాలను ప్రకటించింది. ఇందులో కస్టమర్ సర్వీస్, బ్యాకెండ్ కార్యకలాపాలకు సంబంధించిన పొజిషన్లకు ముంబై, ఢిల్లీ రెండు చోట్లా నియమించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. కస్టమర్ ఎంగేజ్ మెంట్ మేనేజర్, డెలివరీ ఆపరేషన్స్ స్పెషలిస్ట్ వంటి ఉద్యోగులను కేవలం ముంబై కేంద్రంగా తీసుకోనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.

టెస్లా(Tesla).. భారత ప్రభుత్వం మధ్య చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటివరకు ఆ కంపెనీ భారతదేశంలో పెద్ద పెట్టుబడులు పెట్టలేదు. దీనికి అతిపెద్ద కారణం భారతదేశంలో అధిక దిగుమతి సుంకం. అయితే, ప్రభుత్వం ఇప్పుడు $40,000 కంటే ఎక్కువ ధర గల కార్లపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 110శాతం నుండి 70శాతానికి తగ్గించింది. దీని వలన టెస్లా(Tesla) భారతదేశంలోకి ప్రవేశించడం సులభం అయింది.భారతదేశ ఎలక్ట్రిక్ వాహన (EV) మార్కెట్ ఇప్పటికీ చైనా కంటే చాలా చిన్నదే అయినప్పటికీ, ఇది టెస్లా(Tesla)కు కొత్త అవకాశం కావచ్చు. టెస్లా(Tesla) ఇటీవల ఒక దశాబ్దంలో మొదటిసారిగా వార్షిక EV అమ్మకాల్లో క్షీణతను చవిచూసింది. 2023లో భారతదేశంలో దాదాపు 1 లక్ష ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. చైనాలో ఈ సంఖ్య 1 కోటి.

అమెరికాలో ఎలాన్ మస్క్(Alon Mask), ప్రధాని మోదీ(PM Modi) మధ్య జరిగిన సమావేశం తర్వాత భారతదేశంలో టెస్లా అవకాశాలు బలపడ్డాయి. ఈ సమయంలో, ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump)ను కూడా కలిశారు. వాణిజ్య లోటును తగ్గించడానికి, అమెరికన్ సైనిక పరికరాల కొనుగోళ్లను పెంచడానికి భారతదేశం, అమెరికా చర్చలు జరుపుతాయని ట్రంప్ అన్నారు. ఇందులో F-35 ఫైటర్ జెట్ల సరఫరాపై చర్చ కూడా ఉంది.

కాగా ఎలోన్ మస్క్(Alon Mask) ట్రంప్ Donald Trump)పరిపాలనలో కీలక సభ్యుడు. కానీ ఆయన టెస్లా CEO హోదాలో మోడీని కలిశారా లేదా అతని DOGE బృందం ప్రతినిధిగా కలిశారా అనేది అస్పష్టంగా ఉంది.

మస్క్(Alon Mask) వ్యాపార, రాజకీయ పాత్రల మధ్య సరిహద్దులు అస్పష్టంగా మారుతున్నాయి. ఇటీవలే, ఇటాలియన్ ప్రభుత్వానికి సురక్షితమైన టెలికమ్యూనికేషన్ సేవలను అందించే ఒప్పందంపై మస్క్(Alon Mask) స్పేస్‌ఎక్స్‌తో చర్చలు జరిపినట్లు ఇటలీ ధృవీకరించింది. ఫ్లోరిడాలో ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ను కలిసినప్పుడు ఈ ఒప్పందం చర్చకు వచ్చింది.

Next Story

Most Viewed