ఉద్యోగులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన TCS.. ఎందుకంటే..!

by Harish |   ( Updated:2023-05-31 16:57:20.0  )
ఉద్యోగులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన TCS.. ఎందుకంటే..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్) తన ఉద్యోగులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. కరోనా సమయంలో తీసుకొచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్నారు. అయితే ఇటీవల కరోనా తగ్గడం, అన్ని రంగాల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడటంతో హైబ్రిడ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.

వారానికి మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీస్ నుంచి పనిచేయాలని (Work From Office) నిబంధనలు తీసుకొచ్చింది. దీంతో ఉద్యోగులు నెలలో కనీసం 12 రోజులు ఆఫీస్ నుంచి పని చేయాల్సి ఉంటుంది. అయితే ఉద్యోగులు ఈ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇక మీదట వారిపై కఠినంగా వ్యవహరించనున్నట్లు టీసీఎస్ తన ఉద్యోగులకు తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.

నిబంధనలు పాటించని వారికి నోటీసులు కూడా పంపించడం మొదలు పెట్టింది. కంపెనీ తన ఉద్యోగులకు పంపిన మెమోలో రోస్టర్ ప్రకారం, మీ ఆఫీస్ లొకేషన్ నుంచి పని చేస్తున్నట్లు రిపోర్ట్ చేయాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ విషయంపై టీసీఎస్ స్పందిస్తూ.. ‘ గత రెండేళ్లలో చాలా మంది కంపెనీలో కొత్తగా చేరారని, వారికి ఆఫీసు వాతావరణం తెలియాల్సి ఉందని, మెరుగైన ఫలితాలు వచ్చేందుకు, అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు ఆఫీస్ నుంచి పని చేయాల్సిందేనని’ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed