- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
DTH Services: విలీనం కానున్న ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ, టాటా ప్లే

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో వేగంగా పెరుగుతున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ప్రభావంతో డీటీహెచ్ కంపెనీలు దెబ్బతింటున్నాయి. క్రమంగా డీటీహెచ్ వినియోగదారులు తగ్గిపోతున్నారు. ఈ క్రమంలో డీటీహెచ్ విభాగంలో అతిపెద్ద కంపెనీలైన భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన డిజిటల్ టీవీ, టాటా యాజమాన్యంలోని టాటా ప్లే విలీనం కానున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే ఇరు కంపెనీలు చర్చలు ప్రారంభించాయని జాతీయ మీడియా పేర్కొంది. గత కొంతకాలంగా లైవ్ స్ట్రీమింగ్ పరిశ్రమలో ఆధిపత్యం కారణంగా డైరెక్ట్-టూ-హోమ్(డీటీహెచ్) కస్టమర్లు తగ్గిపోతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఇరు కంపెనీలు విలీనం కావాలని నిర్ణయించాయి. విలీనం అనంతరం షేర్లను రెండు కంపెనీలు పంచుకోనున్నాయి. ఇందులో అత్యధికంగా 50 శాతం కంటే ఎక్కువ వాటాను ఎయిర్‌టెల్ కంపెనీ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా కంపెనీ తన ఎంటర్‌టైన్‌మెంట్ వ్యాపారంతో పాటు బ్రాడ్‌బ్యాడ్ సేవలను విస్తరించనుంది. ఈ విలీనంతో టాటా ప్లేకు చెందిన 1.9 కోట్ల మంది కస్టమర్లు ఎయిర్‌టెల్ సేవలను కూడా పొందనున్నారు. ఇరు సంస్థల మధ్య చర్చలు విజయవంతమైతే 2016లో డిష్ టీవీ-వీడియోకాన్ డీటీహెచ్ విలీనం తర్వాత, గడిచిన దశాబ్ద కాలంలో దేశీయంగా రెండో అతిపెద్ద డీటీహెచ్ విలీనం కానుంది. కొత్త సంస్థకు ఎయిర్‌టెల్ సీనియర్ యాజమాన్యం నిర్వహించనుందని తెలుస్తోంది.