ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం టాటా మోటార్స్, హెచ్‌పీసీఎల్ ఒప్పందం

by S Gopi |
ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం టాటా మోటార్స్, హెచ్‌పీసీఎల్ ఒప్పందం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా 5,000 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసేందుకు హెచ్‌పీసీఎల్‌తో టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు బుధవారం తెలిపింది. టాటా ఈవీ కార్ల వినియోగదారులు తరచుగా ప్రయాణించే, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కేంద్రాలు ఉన్న ప్రదేశాల్లో ఛార్జర్లను ఏర్పాటు చేసేందుకు హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) సహకరిస్తుందని పేర్కొంది. దీనివల్ల ప్రస్తుతం 1.2 లక్షలకు పైగా ఉన్న కస్టమర్లకు ఎంతో ఉపయోగపడుతుందని టాటా మోటార్స్ ఓ ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించి బుధవారం ఇరు సంస్థలూ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంతే కాకుండా ఇరు సంస్థలు కలిసి సంయుక్తంగా వినియోగదారులకు చెల్లింపుల్లో ఇబ్బందులు తలెత్తకుండా కో-బ్రాండెడ్ ఆర్ఎఫ్ఐడీ కార్డులను తీసుకురావాలని భావిస్తున్నాయి. కాగా, హెచ్‌పీసీఎల్ దేశవ్యాప్తంగా 21,500 ఇంధన స్టేషన్లను కలిగి ఉంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 5,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా ఉంది.

Advertisement

Next Story

Most Viewed