- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడానికి రూ. 2 వేల కోట్ల వేటలో SpiceJet!
న్యూఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ నిధుల వేట మొదలుపెట్టింది. ఇతర విమానయాన సంస్థలతో పాటు ఇతర మార్గాల ద్వారా రూ. 2,000 కోట్ల వరకు నిధులు సమీకరించేందుకు అవకాశాలను వెతుకుతున్నట్టు స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ మేరకు పరిశ్రమల సంస్థ అసోచామ్ నిర్వహించిన కార్యక్రమంలో సీఎండీ చెప్పారు. అయితే, రూ. 2,000 కోట్ల వరకు సేకరించేందుకు సంస్థలో ఎంత వాటాను విక్రయించనున్నారనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. ఇటీవల స్పైస్‌జెట్ సంస్థ తన మొత్తం విమానాల్లో 50 శాతానికి మించి కార్యకలాపాలను నిర్వహించకూడదని విమానయాన రంగ రెగ్యులేటర్ డీజీసీఏ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
వరుస సంఘటనల్లో స్పైస్‌జెట్ విమానాలు లోపాలను ఎదుర్కొన్న కారణంగా డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. స్పైస్‌జెట్ గత నాలుగేళ్లుగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. పెరుగుతున్న ఇంధన ధరలు, కరోనా మహమ్మారితో కష్టాలు ఇంకా పెరిగాయి.
- Tags
- SpiceJet