- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో బలహీన ర్యాలీ కొనసాగుతోంది. అంతకుముందు సెషన్‌లో భారీ నష్టాలను చూసిన సూచీలు గురువారం ట్రేడింగ్‌లోనూ అదే ధోరణిని కొనసాగించాయి. ఉదయం అధిక లాభాలతో ర్యాలీ ప్రారంభించిన స్టాక్ మార్కెట్లు క్రమంగా నీరసించాయి. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, జూన్ త్రైమాసిక ఫలితాల కారణంగా హెవీవెయిట్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కారణంగా మిడ్-సెషన్ నుంచి నష్టాలు మొదలయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 27.43 పాయింట్లు నష్టపోయి 79,897 వద్ద, నిఫ్టీ 8.50 పాయింట్ల నష్టంతో 24,315 వద్ద ముగిశాయి. నిఫ్టీలో రియల్టీ, హెల్త్‌కేర్, ఫార్మా, ఆటో రంగాలు క్షీణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐటీసీ, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, ఎస్‌బీఐ, టైటాన్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, ఎన్‌టీపీసీ, నెస్లె ఇండియా, పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.58 వద్ద ఉంది.