- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Stock Market: వరుసగా ఎనిమిదవ రోజూ స్టాక్ మార్కెట్ల పతనం

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. ఇందుకు ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పన్నుల విషయంలో ఇతర దేశాలపై అనుసరిస్తున్న తీరు కారణంగా పెట్టుబడిదారుల్లో ఆందోళనలు పెరగడమే కారణం. అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భాయాలు నెలకొనడంతో గ్లోబల్ మార్కెట్లతో పాటు మన మార్కెట్లలో భారీగా అమ్మకాలు జరిగాయి. భారత మార్కెట్లకు సంబంధించి తాజాగా యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పన్నుల విషయంలో స్పష్టత ఇచ్చారు. భారత్ మిత్ర దేశమైనప్పటికీ పరస్పర పన్నులు తప్పవని ట్రంప్ వ్యాఖ్యలతో సూచీలపై ఒత్తిడి పెంచింది. దీనికి తోడు మన మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నిధుల ఉపసంహరణను కొనసాగించడం, డిసెంబర్ త్రైమాసిక ఫలితాల్లో కంపెనీల ఆదాయాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా వరుస నష్టాలకు కారణాలయ్యాయి. దీంతో శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 199.76 పాయింట్లు నష్టపోయి 75,939 వద్ద, నిఫ్టీ 102.15 పాయింట్లు క్షీణించి 22,929 వద్ద ముగిశాయి. నిఫ్టీలో అన్ని రంగాలు పతనమయ్యాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లె ఇండియా, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. అదానీ పోర్ట్స్, ఆల్ట్రా సిమెంట్, సన్‌ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్ స్టాక్స్ అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 86.67 వద్ద ఉంది.