- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పెద్దల 'వీ-కేర్' డిపాజిట్ స్కీమ్ కాలవ్యవధిని పొడిగించిన SBI!
by Harish |

X
న్యూఢిల్లీ: దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సీనియర్ సిటిజన్ల కోసం తీసుకొచ్చిన స్పెషల్ 'వీ-కేర్ ' ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ గడువును జూన్ 30 కి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద పెద్దలకు సాధారణ ప్రజలకు ఇచ్చే వడ్డీ 0.50 శాతం కంటే అదనపు వడ్డీ రేటుకు మించి మరింత ఎక్కువ 0.50 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. అయితే, ఈ స్పెషల్ డిపాజిట్ స్కీమ్ పరిమిత కాలవ్యవధికి మాత్రమే వర్తిస్తుంది.
'వీర్-కేర్' పథకం కాలవ్యవధి కనిష్టంగా ఐదేళ్లు, గరిష్టంగా 10 ఏళ్లు ఉంటుంది. ఈ పథకంపై అదనపు వడ్డీ రాబడిని పొందేందుకు 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పెద్దలు అర్హులు. ఈ పథకాన్ని తొలిసారిగా 2020, మే లో ప్రారంభించారు. ఆ తర్వాత అనేకమార్లు పొడిగించిన తర్వాత తాజాగా 2023, జూన్ 30 కి పొడిగించారు.
Next Story