- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మే నెలలో 10 శాతం పెరిగిన ఇంధన అమ్మకాలు!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం, వేసవిలో ప్రయాణాలు పెరగడంతో ఈ ఏడాది మే నెలలో పెట్రోల్, డీజిల్, విమాన ఇంధన అమ్మకాలు 9-10 శాతం పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు కంపెనీల నుంచి లభించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, గతేడాది ఇదే నెలలో పెట్రోల్ అమ్మకాలు 10.4 శాతం పెరిగాయి. పెట్రోల్ వినియోగం గత నెలలో 2019 నాటితో పోలిస్తే దాదాపు పావు వంతు ఎక్కువగా విక్రయించబడింది.
సెలవుల్లో ప్రయాణాలు పెరగడంతో పాటు కార్లు, మోటార్‌సైకిళ్ల అమ్మకాలు పెరగడం, ఆర్థిక కార్యకలాపాల మద్దతు అమ్మకాల వృద్ధికి దోహదపడ్డాయి. అలాగే, పారిశ్రామిక, మైనింగ్ కార్యకలాపాల పెరగడంతో రిటైల్ డిమాండ్ పుంజుకుని డీజిల్ వినియోగం 9.3 శాతం వృద్ధి నమోదైంది.
కర్ణాటకలో ఎన్నికలు కూడా డీజిల్ డిమాండ్ పెరిగేందుకు దోహదపడ్డాయి. 2019 నాటితో పోలిస్తే గత నెల డీజిల్ అమ్మకాలు 7 శాతం పెరిగాయి. ఇక, విమాన ప్రయాణాలు పెరగడంతో జెట్ ఇంధన అమ్మకాలు కూడా గతేడాది కంటే 8.7 శాతం పెరిగాయి. దేశీయ విమానయాన ప్రయాణం రికార్డు స్థాయిలో పెరిగినప్పటికీ, అంతర్జాతీయ ప్రయాణాలు కరోనా ముందు స్థాయి నుంచి ఇంకా కోలుకోలేదు. 2019, మే నెల కంటే జెట్ ఇంధన అమ్మకాలు 5.3 శాతం తక్కువగా ఉన్నాయి. వంట గ్యాస్(ఎల్‌పీజీ) అమ్మకాలు గతేడాది కంటే 9.8 శాతం పెరగ్గా, 2019 కంటే 20 శాతం వృద్ధి చెందాయి.
Also Read..