- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. 65,000 కోట్లకు ఆర్‌వీఎన్ఎల్ ఆర్డర్ బుక్
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ ఆర్‌వీఎన్ఎల్ ఆర్డర్ బుక్ రూ. 65 వేల కోట్లకు చేరుకుందని, అందులో 50 శాతం రైల్వే ప్రాజెక్టులే అని సంస్థ వెల్లడించింది. అలాగే, రైల్ వికాస్ నిగం లిమిటెడ్(ఆర్‌వీఎన్ఎల్) మధ్య ఆసియా, యూఏఈ, పశ్చిమాసియాతో సహా పలు విదేశాల్లో కొత్త ప్రాజెక్టుల కోసం వెతుకుతున్నట్టు ఇన్వెస్టర్ల కాల్‌లో యాజమాన్యం వెల్లడించింది. 'తాము సుమారు రూ. 65,000 కోట్ల ఆర్డర్ బుక్ పొందాం. ఇందులో సగం వరకు సాధారణ రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయని, మిగిలిన సగం మార్కెట్ల నుంచి ఉంది. రానున్న రోజుల్లో మేము రూ. 75 వేల కోట్ల వరకు ఆర్డర్ బుక్‌ను నిర్వహించగలమని' సంస్థ అధికారులు పేర్కొన్నారు. మొత్తం ఆర్డర్ బుక్‌లో వందే భారత్ రైళ్ల వాటానే దాదాపు రూ. 9,000 కోట్లు ఉన్నాయని, మెట్రో ప్రాజెక్టుల ఆర్డర్ల విలువ రూ. 7,000 కోట్లు ఉన్నాయి. ఇవి కాకుండా కంపెనీ ఎలక్ట్రిఫికేషన్, ట్రాన్స్‌మిషన్ లైన్‌లలో ఇతర ప్రాజెక్టులు ఉన్నాయని ' ఓ అధికారి వివరించారు. సంస్థ కొత్త రంగాల్లో ప్రాజెక్టులను వేగంగా పొందుతోంది, ముఖ్యంగా విదేశాల్లోనూ అనేక ప్రాజెక్టులను చేపట్టే అంశాలను పరిశీలిస్తోందని వెల్లడించారు. విదేశీ మార్కెట్లలో వృద్ధికి సంబంధించి పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్(పీపీపీ) మోడల్‌లో ప్రాజెక్టులను చేపడతాం. మరికొన్ని దేశాల్లో ఆఫీసులను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఆర్‌వీఎన్ఎల్ రైలు మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టుల అభివృద్ధి, ఫైనాన్సింగ్ అందించే సంస్థ.