పోస్టాఫీసులో అదిరిపోయే స్కీం: రోజుకు రూ. 95 పెట్టుబడితో చేతికి రూ. 14 లక్షలు

by Harish |   ( Updated:2023-04-06 14:07:59.0  )
పోస్టాఫీసులో అదిరిపోయే స్కీం: రోజుకు రూ. 95 పెట్టుబడితో చేతికి రూ. 14 లక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా దేశంలో ఆరోగ్య పాలసీలు తీసుకునేవారి సంఖ్య చాలా వరకు పెరిగింది. అయితే పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు పాలసీల పట్ల కొంత మేరకు అవగాహన ఉన్నప్పటి, గ్రామీణ ప్రాంతాల్లోని వారికి అంతగా అవగాహన లేకపోవడం వలన గ్రామాల్లో పాలసీలు తీసుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో అక్కడ కూడా పాలసీల గురించి, దాని ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయడానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోస్టాఫీసు కొత్తగా ‘గ్రామ్ సుమంగల్ స్కీమ్’ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో గ్రామీణ ప్రాంతాల్లోని వారు మాత్రమే పెట్టుబడి పెట్టడానికి అర్హులు.

గ్రామ్ సుమంగల్ స్కీమ్ పాలసీ తక్కువ ఖర్చులో పాలసీని అందిస్తుంది. రోజు కేవలం రూ.95 చెల్లింపుతో ఏకంగా రూ.14 లక్షలను పొందొచ్చు. దీనిలో చేరడానికి 19 నుండి 45 సంవత్సరాల మధ్య గల వారు అర్హులు. 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల కాలవ్యవధితో ఈ పాలసీ కొనుగోలు చేయవచ్చు. డెత్ బెనిఫిట్స్ క్రింద పాలసీ దారు మధ్యలో మరణిస్తే వారి నామినీకి ఆర్థిక ప్రయోజనాలను అందిస్తారు. 15 ఏళ్ల టర్మ్‌తో పాలసీ తీసుకుంటే 6, 9, 12 ఏళ్లలో పాలసీ డబ్బులు 20 శాతం తిరిగి తీసుకోవచ్చు. మిగిలిన 40 శాతం డబ్బులు మెచ్యూరిటీ అప్పుడు వస్తాయి. అదే 20 ఏళ్ల కాల పరిమితి అయితే 8, 12, 16 ఏళ్లలో 20 శాతం పాలసీ డబ్బులు తీసుకోవచ్చు, మిగిలిన డబ్బులు మెచ్యూరిటీ టైం లో వస్తాయి.

ఉదాహరణకు.. మీరు రోజు రూ. 95 పెట్టుబడి పెట్టడం ద్వారా నెలకు రూ. 2,850 అవుతుంది. 20 ఏళ్ల కాలానికి పాలసీ తీసుకుని పెట్టుబడి పెట్టినట్లయితే మొత్తం 7 లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేస్తారు. కానీ తర్వాత చేతికి రూ.14 లక్షలు వస్తాయి. ఈ పాలసీ గురించి మరింత సమాచారం కోసం దగ్గరలోని పోస్టాఫీసులో సంప్రదించగలరు.

Read more :

IRCTC: రూ. 52 వేలకే థాయ్‌లాండ్ టూర్.. బ్యాంకాక్, పట్టాయ చూసే ఛాన్స్!

Advertisement

Next Story