- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారతీయ ఈక్విటీల్లోకి రూ.11 వేల కోట్ల ఎఫ్‌పీఐలు
దిశ, బిజినెస్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తరువాత ప్రభుత్వం ఏర్పడటంతో దేశీయంగా పెట్టుబడులపై ప్రపంచ మార్కెట్ల నుండి సానుకూల సంకేతాలు వస్తున్నాయి. రానున్న బడ్జెట్‌లో ప్రోత్సహకాలు, రాయితీలు లభిస్తాయనే అంచనాలతో దేశంలో క్రమంగా పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జులై 14తో ముగిసిన వారంలో విదేశీ పెట్టుబడిదారులు భారతీయ ఈక్విటీల్లో రూ.11,730 కోట్ల (USD 1.4 బిలియన్లు)ను ఇన్వెస్ట్ చేశారు. ఎన్నికలకు ముందు స్తబ్దుగా ఉన్నవారు ఫలితాల అనంతరం బలమైన పునరాగమనం చేశారు.
ఫలితాలు వచ్చిన రోజు భారీగా పతనమైన మార్కెట్ క్రమంగా కోలుకుంది. దీంతో ఎఫ్‌పీఐలు దేశీయ ఈక్వీటీలల్లో కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే సమయంలో జూన్ 14 వరకు నెలలో నికర అమ్మకాలు రూ.3,064 కోట్లుగా ఉన్నాయి. మరోవైపు ఈ నెలలో (జూన్ 14 వరకు) ఎఫ్‌పీఐలు డెట్ మార్కెట్ లో రూ.5,700 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేశారు. దేశంలో సంకీర్ణ కూటమి ఉన్నప్పటికీ, వరుసగా మూడోసారి కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడడం విధాన సంస్కరణలు, ఆర్థిక వృద్ధి కొనసాగింపుపై అంచనాలను పెంచిందని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ మేనేజర్ రీసెర్చ్ హిమాన్షు శ్రీవాస్తవ అన్నారు.
ఈ ఏడాది ఊహించిన దాని కంటే ద్రవ్యోల్బణం తక్కువగా ఉంటుందనే అంచనాలు కూడా ఎఫ్‌పీఐలు కొనుగోలుకు ఆసక్తి చూపించడానికి ఒక కారణం అయిందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. మేలో ఎఫ్‌పీఐలు ఈక్విటీల నుండి రూ. 25,586 కోట్లను ఉపసంహరించుకున్నారు, ఏప్రిల్‌లో రూ. 8,700 కోట్లకు పైగా ఉపసంహరించుకున్నారు. అదే మార్చిలో రూ.35,098 కోట్లు, ఫిబ్రవరిలో రూ.1,539 కోట్లు నికర పెట్టుబడి పెట్టారు.