- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Scram440: రూ. 2.08 లక్షల ధరలో స్క్రామ్ 440 విడుదల చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్రీమియం టూ-వీలర్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్(Royal Enfield) తన కొత్త స్క్రామ్ 440 బైకు(Scram 440 bike)ను బుధవారం విడుదల చేసింది. రెండు వేరియంట్లలో తీసుకొచ్చిన ఈ బైక్ ధర రూ. 2.08 లక్షల(ఎక్స్‌షోరూమ్) నుంచి ప్రారంభమవుతుందని, టాప్ ఫీచర్లతో కూడిన ఫోర్స్ వేరియంట్ ధర రూ. 2.15 లక్షలుగా ఉంటుందని కంపెనీ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటికే రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 (Royal Enfield Scram 411)మోడల్‌ను విస్తయిస్తోంది. రెండూ ఒకటే అయినప్పటికీ అదనపు ఫీచర్లు, కొన్ని డిజైన్ మార్పులతో రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440ను విడుదల చేసింది.
కొత్త స్క్రామ్ బైక్ 443సీసీ ఎయిర్‌కూల్డ్ ఇంజిన్‌తో వస్తుండగా, ఆరు గేర్లతో ముందూ వెనుక డిస్క్ బ్రేక్‌తో వస్తుంది. అంతేకాకుండా బేస్ వేరియంట్ ట్రయల్ స్పోక్ వీల్స్‌తో లభిస్తుండగా, ఫోర్స్ వేరియంట్ అలాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్స్‌తో రావడం విశేషం. ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక మోనోషాక్ ఇవ్వగా, ట్రయిల్ వేరియంట్ గ్రీన్, ట్రైల్ బ్లూ, ఫోర్స్ వేరియంట్ టీల్, ఫోర్స్ గ్రే, ఫోర్స్ బ్లూ రంగుల్లో వస్తాయని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం ద్విచక్ర వాహన మార్కెట్లో ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 440ఎక్స్, హార్లె డెవిడ్సన్ ఎక్స్440 మోడళ్లకు స్క్రామ్ 440 గట్టి పోటీ ఇవ్వగలదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.