- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పేటీఎమ్ వ్యవహరంపై ఎన్‌హెచ్ఏఐ, ఎన్‌పీసీఐతో ఆర్‌బీఐ సమావేశం
దిశ, బిజినెస్ బ్యూరో: డిజిటల్ చెల్లింపుల యాప్ పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంకుపై ఆంక్షల నేపథ్యంలో దీన్నుంచి వినియోగదారులను సంరక్షించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) సిద్ధమైంది. అందుకోసం వచ్చే వారంలో నేషనల్ హైవే అథారిటీ(ఎన్‌హెచ్ఏఐ), ఎన్‌పీసీఐలతో సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో పేటీఎంపై విధించిన ఆంక్షల వల్ల ఇబ్బందిపడే యూజర్లకు భద్రత కల్పించేందుకు అవసరమైన నిర్ణయాలను తీసుకోనున్నారు. ఈ సమావేశానికి డిజిటల్ లావాదేవీలు, టోల్‌ల చెల్లింపు ప్రక్రియను సులభతరం చేయడానికి ఫాస్టాగ్ వ్యవస్థను నిర్వహించే ఎన్‌హెచ్ఏఐ, దాని వాటాదారులు, యూపీఐని నిర్వహించే ఎన్‌పీసీఐ అధికారులు హాజరుకానున్నారు. సమావేశం అనంతరం పేటీఎమ్ యూజర్లు ఫాస్టాగ్, ఇతర చెల్లింపులపై అడుగుతున్న ప్రశ్నలకు వివరణ ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా టోల్ వసూళ్ల కోసం కేంద్ర ఫాస్టాగ్ వ్యవస్థను తీసుకొచ్చింది. దీన్ని ఎన్‌హెచ్ఏఐ నిర్వహిస్తుండగా, ఫాస్టాగ్‌లో ఉండే టెక్నాలజీ ద్వారా ప్రీపెయిడ్ లేదా సేవింగ్స్ ఖాతాల నుంచి నేరుగా టోల్‌ను చెల్లించవచ్చు. ఈ ఫాస్టాగ్ చెల్లింపుల్లో ఎక్కువగా పేటీఎమ్ ద్వారా జరుగుతున్నాయి. ఆర్‌బీఐ ఆంక్షల కారణంగా టోల్ చెల్లింపులకు ప్రత్యామ్నాయం కావాలని యూజర్లు అడుగుతున్నారు.