- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RBI: యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులపై భారీ జరిమానా విధించిన ఆర్‌బీఐ
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులపై భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) భారీ జరిమానా విధించింది. నియంత్రణా పరమైన నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా రెండు బ్యాంకులపై మొత్తం రూ. 2.91 కోట్ల పెనాల్టీ విధిస్తున్నట్టు మంగళవారం ప్రకటనలో తెలిపింది. ఇందులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుపై రూ. కోటి, యాక్సిస్ బ్యాంకుపై రూ. 1.91 కోట్ల జరిమానా వర్తిస్తుంది. ఆర్‌బీఐ అధికారిక ప్రకటన ప్రకారం.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వినియోగదారులకు అందించే సేవల్లో నిబంధనలు పాటించకపోవడం, డిపాజిట్లపై వడ్డీ విషయంలోనూ ఉల్లంఘన కనిపించిన కారణంగా పెనాల్టీ విధించబడింది. అలాగే, వ్యవసాయ రుణాల మార్గదర్శకాలను పాటించకపోవడం, కేవైసీ, డిపాజిట్లపై వడ్డీ విషయంలో నిబంధనలు ఉల్లంఘించడంతో యాక్సిస్ బ్యాంకుపై జరిమానా విధిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. 2022, మార్చి 31 నాటికి జరిగిన చట్టబద్ధమైన తనిఖీల్లో ఈ లోపాలు గుర్తించినట్టు ఆర్‌బీఐ పేర్కొంది.