- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
RBI: ఎంపీసీ సమావేశంలో కీలక రేట్ల కోత

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్‌లో ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తూ వినియోగానికి మద్దతు ఇచ్చే చర్యలను ప్రకటించడంతో, ఆర్థిక వృద్ధిని పెంచే బాధ్యత ఆర్‌బీఐ చేతిలోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) దాదాపు ఐదేళ్లలో మొదటిసారిగా పాలసీ రెపో రేటును తగ్గించవచ్చని తెలుస్తోంది. తాజాగా యెస్ బ్యాంక్ నిర్వహించిన ఓ పోల్‌లో ఆర్థికవేత్తలు ఈసారి జరగబోయే ఎంపీసీ సమావేశంలో ఆర్‌బీఐ కీలక రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించవచ్చని అంచనా వేశారు. వృద్ధి బలహీనంగా ఉండటం, ద్రవ్యోల్బణం, బడ్జెట్‌లో ప్రకటించిన నిర్ణయాలను బట్టి రేట్లను తగ్గించే ఛాన్స్ ఉంది. ఆహార పదార్థాల ధరలు దిగిరావడంతో గతేడాది డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్టం 5.22 శాతానికి తగ్గింది. గత నెలలో 5.48 శాతానికి పెరిగినప్పటికీ, తాజా బడ్జెట్ సానుకూలంగా ఉండటం, ఆర్థిక కేటాయింపులు సర్దుబాటు చేయడంతో వడ్డీ రేట్ల తగ్గింపు ఉండవచ్చనే అంచనాలున్నాయని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ గౌరా సేన్ గుప్తా చెప్పారు. ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం ఫిబ్రవరి 5-7 తేదీల మధ్య జరగనుంది. ఆర్‌బీఐ గత 11 వరుస సమావేశాల్లో పాలసీ రెపో రేటును మార్చకుండా స్థిరంగా ఉంచింది. చివరిగా 2020, మేలో కొవిడ్-19 మహమ్మారి సమయంలో రేట్లను తగ్గించింది.