PSBs: మినిమమ్ బ్యాలెన్స్ పేరుతో రూ.2 వేల కోట్ల వసూలు చేసిన ప్రభుత్వ బ్యాంకులు

by S Gopi |
PSBs: మినిమమ్ బ్యాలెన్స్ పేరుతో రూ.2 వేల కోట్ల వసూలు చేసిన ప్రభుత్వ బ్యాంకులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: బ్యాంకు ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచని డిపాజిటర్ల నుంచి బ్యాంకులు పెద్ద మొత్తంలోనే జరిమానాలను వసూలు చేస్తున్నాయి. అదేవిధంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో నెలవారీగా సగటు బ్యాలెన్స్ నిర్వహించని బ్యాంకు ఖాతాదారుల నుంచి ప్రభుత్వం బ్యాంకులు ఏకంగా రూ. 2,331 కోట్ల జరిమానాను విధించాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ మంగళవారం లోక్‌సభకు తెలియజేశారు. ఈ మొత్తం అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వసూలు చేసిన దానికంటే 25 శాతం ఎక్కువ కావడం గమనార్హం. అయితే, పట్టణాలు, గ్రామాల్లో ఈ వసూలు చేసే మొత్తంలో వ్యత్యాసం ఉంటుంది. ప్రభుత్వం సమాచారం ప్రకారం, సమీక్షించిన ఏడాది మొత్తం వసూళ్లలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అత్యధికంగా రూ. 633 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 386 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ. 369 కోట్లు, కెనరా బ్యాంక్ రూ. 284 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 194 కోట్లను వసూలు చేశాయి. అంతేకాకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు 2019-20 నుంచి ఐదేళ్లలో మినిమమ్ బ్యాలెన్స్ లేని కారణంగా సుమారు రూ. 8,500 కోట్లు వసూలు చేశాయని పంకజ్ చౌదరీ తెలిపారు.

Next Story

Most Viewed