- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేసవికాలం AC ని ఆన్ చేస్తున్నారా..! అయితే కచ్చితంగా ఇలా చేయండి
దిశ, వెబ్‌డెస్క్: వేసవికాలం పూర్తిగా ప్రారంభం కాకముందే వేడి, ఉక్కపోత ఇప్పటికే ఎక్కువగా ఉంది. ఈ వేడిని తట్టుకోవాలంటే ఇన్ని రోజులు వాడకుండా ఉన్నటువంటి AC ని తిరిగి ప్రారంభించాల్సిందే. అయితే మీ ఇంట్లో AC స్విచ్‌ను ఆన్ చేసినప్పుడు, అది మంచి కండీషన్‌లో ఉందా లేదా అని చెక్ చేసుకోవడం ఉత్తమం. వేసవి కాలం పూర్తిస్థాయిలో రాకముందే ఇలాంటి పనులు చేయాలి. చాలా రోజుల తర్వాత AC ని ఆన్ చేస్తున్న వారికి కొన్ని ముఖ్యమైన సూచనలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
* ముందుగా AC ని ఆన్ చేసే ముందు దాని బయట వైర్ కరెక్ట్‌గా ఉందా లేదా అని చూడాలి.
* మెయిన్ స్విచ్‌ను ఆఫ్ చేసి AC ప్యానెల్‌ని ఓపెన్ చేసి, ఫిల్టర్లను తీసేసి వాటిని క్లీన్ చేయాలి.
* కొత్త టూత్ బ్రష్ సహయంతో వేపోరేటర్‌లో ఉన్నటుంటి దుమ్మును మెల్లగా తొలగించాలి.
* వేపొరేటర్ కాయిల్‌లో వైర్లు ఎక్కువగా ఉంటే గనక వాటిని ఏ మాత్రం కదపకుండా జాగ్రత్తగా డస్ట్ తీసేయాలి.
* ఫిల్టర్లను బయటికి తీశాక, AC లోపల ప్యాన్‌ను తడి గుడ్డతో తుడవాలి.
* తరువాత యధావిధిగా AC ప్యానల్స్‌ను తిరిగి ఫిట్ చేసి ఆన్ చేసి. గాలి సరిగా వస్తుందా అని చెక్ చేయాలి.
* గాలి బయటికి వచ్చే ప్లేస్‌లో ఏమైనా అడ్డంకులు ఉంటే వాటిని క్లియర్ చేయాలి.
ప్రతి ఏడాది వేసవికాలంలో AC ని ఆన్ చేసిన ప్రతిసారి ఈ విషయాలు గుర్తుంచుకుని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వలన ACలు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.