- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సామాన్య ప్రజలకు ఊరట.. రూ. 200 గ్యాస్ సబ్సిడీ మరో ఏడాది పొడిగింపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకం లబ్ధిదారులకు శుభవార్తను అందించింది. ఈ సబ్సిడీని మరో ఏడాదిపాటు పొడిగించినట్లు పేర్కొంది. ఈ పథకం కింద సంవత్సరానికి 12 గ్యాస్ సిలిండర్ల వరకు 14.2 కిలోల సిలిండర్‌పై రూ. 200 సబ్సిడీ ఇస్తారు. ఈ సబ్సిడీ పొడిగింపునకు సంబంధించి కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. దీని కోసం ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ. 6,100 కోట్లు ఖర్చు చేయగా, ఈ భారం 2023-24 నాటికి రూ.7,680 కోట్లుగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ దీనికి సంబంధించి పేర్కొన్న వివరాల ప్రకారం, 1 మార్చి 2023 నాటికి 9.59 కోట్ల PMUY లబ్ధిదారులు ఉన్నారు. వారందరు గ్యాస్ సిలిండర్‌పై రూ. 200 సబ్సిడీ పొందుతారని, ఈ అమౌంట్ నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇప్పటికే మే 22, 2022 నుంచి ఈ సబ్సిడీని ఇస్తున్నాయి.