ఎంపిక చేసిన డిపాజిట్లపై వడ్డీ పెంచిన పంజాబ్ నేషనల్ బ్యాంక్!

by Harish |
ఎంపిక చేసిన డిపాజిట్లపై వడ్డీ పెంచిన పంజాబ్ నేషనల్ బ్యాంక్!
X

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు సోమవారం ప్రకటించింది. రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తం డిపాజిట్లపై ఎంపిక చేసిన కాలవ్యవధులకు కొత్త వడ్డీ రేట్లు బ్యాంకు తెలిపింది. సవరించిన రేట్లు ఫిబ్రవరి 20 నుంచే అమల్లోకి రానున్నాయి.

బ్యాంకు అధికారిక వివరాల ఆధారంగా, 7 రోజుల నుంచి 270 రోజుల వరకు ఎఫ్‌డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ఈ కాలవ్యవధులకు వడ్డీ 3.50 శాతం నుంచి 5.50 శాతం మధ్య ఉంది. సోమవారం నుంచి సవరించిన దాని ప్రకారం, 271 రోజుల నుంచి ఏడాది కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీని 5.50 శాతం నుంచి 30 బేసిస్ పాయింట్లు పెంచుతూ 5.80 శాతానికి చేర్చింది.

అలాగే, ఏడాది, ఏడాది నుంచి 2 ఏళ్ల డిపాజిట్లపై 6.80 శాతం, 2-3 ఏళ్లకు 7 శాతం వడ్డీని మార్చినట్టు బ్యాంకు వెల్లడించింది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం ఎక్కువ వడ్డీ రేట్లు అమలవుతాయని బ్యాంకు పేర్కొంది.

Advertisement

Next Story