PF Withdraw: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పీఎఫ్ డబ్బులు ఇక ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకునే ఛాన్స్..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-12-01 14:09:01.0  )
PF Withdraw: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పీఎఫ్ డబ్బులు ఇక  ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకునే ఛాన్స్..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఉద్యోగం(Job) చేసే ప్రతి ఒక్కరికి పీఎఫ్ ఖాతా(PF Account) ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. ఉద్యోగికి వచ్చే జీతం(Salary)లో ప్రతి నెల 12 శాతం డబ్బును పీఎఫ్ అకౌంట్‌లో డిపాజిట్(Deposit) చేస్తారు. ఇందులో డిపాజిట్ చేసిన డబ్బుకి వడ్డీ(Interest) లభిస్తుంది. అయితే ఉద్యోగులకు అత్యవసరమైనప్పుడు ఇందులో జమ చేసిన మొత్తాన్ని వాడుకునే అవకాశం కలిపించారు. కాగా పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి పెద్ద ప్రక్రియ(Long Process) ఉంటుంది. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న వారం రోజుల తర్వాత ఉద్యోగి అకౌంట్‌లోకి ఈ డబ్బు క్రెడిట్ అవుతుంది.

అయితే ఈ ప్రక్రియను ఈజీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం(Central Govt) సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2025 జూన్ నాటికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) ఖాతాదారులకు డెబిట్ కార్డ్(Debit Card) తరహా సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తునట్లు సమాచారం. ఈ సదుపాయంతో ఉద్యోగులు పీఎఫ్ అకౌంట్ నుంచి ఏటీఎం కార్డు ద్వారా డబ్బును విత్‌డ్రా(Money Withdraw) చేసుకునే అవకాశం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ త్వరలో తీసుకురానున్న EPFO​​3.0 ప్లాన్‌లో భాగంగా ఈ సదుపాయం తీసుకురానున్నారు. అలాగే రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులు ఎక్కువ మొత్తంలో ప్రయోజనాలను పొందేందుకు అధిక ప్రావిడెంట్ ఫండ్(PF) కూడా చెల్లించే అవకాశం కూడా అందుబాటులోకి రానుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి అధికారిక ప్రకటనే వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.

Advertisement

Next Story