- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మార్చి 15 తర్వాత కూడా పనిచేయనున్న పేటీఎం యూపీఐ

దిశ, బిజినెస్ బ్యూరో: పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌కు థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్(టీపీఏపీ)గా యూపీఐ సేవలు నిర్వహించేందుకు ఎన్‌పీసీఐ అనుమతిచ్చింది. దీనివల్ల ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం మార్చి 15 నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ రద్దయినా, యూపీఐ లావాదేవీలు కొనసాగనున్నాయి. దీనికోసం పేటీఎం కోసం పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్‌గా నాలుగు బ్యాంకులు భాగస్వామ్యం అందించనున్నాయి. వాటిలో యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, యెస్ బ్యాంకులు ఉన్నాయి. పేటీఎంలో ఇప్పటికే ఉన్న, కొత్త యూపీఐ వ్యాపారులకు మర్చంట్ కొనుగోలు బ్యాంకుగా యెస్ బ్యాంక్ వ్యవహరించనుంది. దీనివల్ల లావాదేవీలు, ఆటోపే నిరంతరాయంగా కొనసాగనున్నాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) గురువారం ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం పేటీఎం యాప్‌లో ఉన్న సంబంధిత అధికారాలను పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్ బ్యాంకులకు అందజేసే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఎన్‌పీసీఐ పేర్కొంది.